Type Here to Get Search Results !

తరాలు మారినా,మారని ఎరుకల బానిస బతుకులు-టిపివైఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నడిగడ్డ శైలజ

తరాలు మారినా,మారని ఎరుకల బానిస బతుకులు-టిపివైఎస్ రాష్ట్ర  ఉపాధ్యక్షులు నడిగడ్డ శైలజ 


పందులను కోల్పోయిన బాధితురాలికి న్యాయం చేయాలి.


విద్యుత్ షాక్ కు గురిచేసి పందులను చంపిన వారిపై చర్యలు తీసుకోవాలి.



(నమస్తే మానుకోట-దంతాలపల్లి)

దంతాలపల్లి మండల కేంద్రంలో గత శుక్రవారం విద్యుత్ షాక్కుగురిచేసి రెండు పందులను చంపగా కోల్పోయిన బాధితురాలికి న్యాయం చేయాలని ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నడిగడ్డ శైలజ  డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మాదగాని యాకలక్ష్మి కి చెందిన పందులు ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపుకు వెళ్ళగా పక్కనే ఉన్న వ్యవసాయ పొలానికి చెందిన ఓ రైతు పంట రక్షణకు విద్యుత్ తీగలు పెట్టడంతో పాటు వారికి విద్యుత్ వచ్చేలా చేయగా ప్రమాదవశాత్తు ఆ తీగలకు తగిలిన పందులు అక్కడికక్కడే మృతి చెందాయి.వాటి విలువ సుమారు రు.50 వేలు ఉంటుందని,చనిపోయిన పందులను సంబంధిత రైతు ఇంటి ముందు వేసి ఆర్ధికంగా ఆదుకోవాలని బాధితురాలు విలపిస్తుండగా ఆరోజు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందాం అని చెప్పి రాత్రికి రాత్రే చనిపోయిన పందులు కూడా మాయం చేసిన  సదర్ రైతుపై చట్టప్రకారం చర్యలు తీసుకుని యాకలక్ష్మీకి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.

పందులు కదా అని నిర్లక్ష్యం విడనాడాలని,మనిషికి జరిగితే ఇలానే ఉంటారా? గ్రామస్థులందరూ నిరుపేద పందుల పెంపకమే జీవనాధారంగా జీవిస్తున్న యాకలక్ష్మీకి అండగా ఉంటామని చెప్పారని,న్యాయం చేయాలని లేనిచో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.

ఈ కార్యక్రమంలో దంతాలపల్లి,తొర్రూరు మండలాల అధ్యక్షులు మానుపాటి సారంగం,తిరుపతి ఏసు మరియు ఎల్లయ్య,పోషయ్య,రామచంద్రు,వీరయ్య,సురుష్,సంపత్,వేణు,ఎల్లమ్మ,పద్మ,వెంకటమ్మ ,రేవతి,సౌమ్య ,మంజుల,రాణి తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad