Type Here to Get Search Results !

అవినీతిపరుడైన అధికారి నుండి మానుకోట భూములను కాపాడాలి -ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు బోడ రమేష్ నాయక్.

-మానుకోట మున్సిపాలిటీ కమిషనర్ పై ఏసీబీ దాడులు నిర్వహించాలి.
-అవినీతిపరుడైన మున్సిపాలిటీ కమిషనర్ నుండి మానుకోట భూములను కాపాడాలి. 
-ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు బోడ రమేష్ నాయక్. 



(నమస్తే మానుకోట-మహబూబాబాద్)
మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో లోకల్ బాడీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపో ను కలిసి మహబూబాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ తన పదవీకాలం దగ్గర పడుతూ ఉండడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే చందంగా వ్యవహరించి తన పదవి కాలంలోనే కావాల్సినంత దోచుకుందాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న భూములకు ఎటువంటి లేఅవుట్లు లేకుండా ఎవరైతే తనకు లక్షలలో డబ్బుల మూట ఇస్తారో వారికి ఇంటి నిర్మాణం అనుమతులు దక్కుతున్నాయి. అమాయకులైన నిరుపేద ప్రజలకు మాత్రం మునిసిపాలిటీ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా కూడా వారికి న్యాయం జరగడం లేదు. సర్వే నెంబర్ తో సంబంధం లేకుండా కూడా గృహ నిర్మాణ అనుమతులు ఇస్తున్న ఏకైక ఉద్యోగి మానుకోట మున్సిపాలిటీ కమిషనర్ మాత్రమే. తనకు డబ్బు వచ్చిందంటే పర్మిషన్ వచ్చినట్టే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. తనకు లక్షలల్లో డబ్బులు ఇస్తే ఏ సర్వే నెంబర్ తో సంబంధం లేకుండా నాలా కన్వర్షన్ చేసే బాధ్యత మున్సిపాలిటీ కమిషనర్ బాధ్యత తీసుకుంటున్నాడు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో వీరారం తండాకు చెందిన భూక్య లాల్ సింగ్ కు చెందిన వారసత్వ భూములలో సర్వేనెంబర్ 275లో హైకోర్టు ద్వారా చేపించిన జిల్లా ఏడి సర్వేయర్ తో సర్వే చేపించిన రిపోర్టు ఉండి కూడా ఆ రిపోర్టుతో సంబంధం లేకుండా తనకు ఎవరైతే డబ్బులిస్తున్నారో వారికి గృహ నిర్మాణ అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయంపై గతంలో కూడా చాలాసార్లు మున్సిపాలిటీ కమిషనర్ ను కలిసి మీరు ఇచ్చిన అనుమతులు సరైనవి కాదు. వాటిని రద్దు చేయండి అని దరఖాస్తు రూపంలో తెలియజేసిన కూడా పట్టించుకోవడం లేదు. ఈ విధంగా వ్యవహరించి మహబూబాబాద్ లో ఉన్నటువంటి భూ కబ్జాదారులకు సహకరిస్తూ మున్సిపాలిటీ కమిషనర్ సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక వైపు భూకబ్జాదారులపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు నమోదు అవుతున్న కూడా అవేవీ తనకు పట్టదు అంటూ ఈ మున్సిపాలిటీ కమిషనర్ వ్యవహరిస్తున్నాడు. తనకు ఉన్న కాలపరిమితిలోనే మానుకోటలో ఉన్న భూములను భూ కబ్జా దారులకు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే జిల్లా లోకల్ బాడీ కలెక్టర్ స్పందించి మునిసిపాలిటీ కమిషనర్ పై విచారణ జరిపి అతను చేసిన అవినీతి అక్రమాలపై ఏసీబీ దాడులు నిర్వహించాలని మరియు అక్రమంగా వారికి వచ్చిన గృహ నిర్మాణ అనుమతులను వెంటనే రద్దు చేసి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను ఇస్మాయిల్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి మానుకోట జిల్లా కమిటీ తరపున జిల్లా లోకల్ పార్టీ కలెక్టర్ ను కోరారు. దీనిపై లోపల బాడీ కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే విచారణ చేపడతారని హామీ ఇచ్చారు. లేనియెడల రాబోయే రోజులలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితుడు భూక్య లాల్ సింగ్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య బాలాజీ నాయక్, కేసముద్రం మండల అధ్యక్షులు బాలు నాయక్, మాజీ వార్డ్ కౌన్సిలర్ భూక్య శ్రీను నాయక్, జిల్లా నాయకులు భూక్య రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.