-దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో యాదవులు సమగ్ర అభివృద్ధిని సాధించాలి-ఎస్సై పిల్లల రాజు.
-దొడ్డి కొమురయ్య విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ లో పాల్గొన్న ఎమ్మార్వో,ఎంపిడివో.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో యాదవులు సమగ్ర అభివృద్ధిని సాధించాలి-ఎస్సై పిల్లల రాజు అన్నారు.మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు,నైజాం తూటాలకు నేల రాలిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహశీల్దార్ కే.చంద్ర రాజేశ్వర్ రావు, ఎంపీడీవో వివేక్ రామ్, ఎస్సై పిల్లల రాజు హాజరై దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేసే దిశగా సాగుతున్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య జయంతి పురస్కరించుకొని, దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం దొరలకు వ్యతిరేకంగా, రజాకారులతో విరోచితంగా పోరాడి, భూమికోసం భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నైజాం తుపాకీ తూటాలకు నేలకొరిగిన ధృవతార దొడ్డి కొమరయ్య యాదవ్ అని అన్నారు. అనంతరం దొడ్డి కొమురయ్య విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు ఊడుగుల ఐలేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవులు శ్రీకృష్ణుని వారసత్వం పునికి పుచ్చుకొని,దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో యాదవులంతా ఐక్య ఉద్యమాలు చేయాలని, యాదవుల తరతరాల చరిత్రను యాదవ సమాజం గుర్తుచేసుకొని రాబోయే రోజుల్లో యాదవులు సామాజిక, రాజకీయ స్థితిగతులను ఎదుర్కొంటూ ఒక బలమైన సామాజిక,రాజకీయ శక్తిగా ఎదగాలని, యాదవులను ఏకతాటి మీదికి తెచ్చి సామాజిక,రాజకీయం వైపు అడుగులేసే విధంగా కార్యచరణతో రాష్ట్రంలో ఉన్న యాదవులందరినీ కలుపుకొని ఐక్య ఉద్యమాలు చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని, అందుకు రాష్ట్రంలో ఉన్న యాదవులందరూ సహకరిస్తు,మన జాతి సామాజిక, రాజకీయ అభివృద్ధికోసం మీ వంతు సహకారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ అప్సర పాషా,దొడ్డి కొమరయ్య విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ప్రధాన కార్యదర్శి ఆవుల సురేష్ యాదవ్, గౌరవాధ్యక్షులు ఊడుగుల లింగయ్య యాదవ్, ఉపాధ్యక్షులు గుండాల ఐలయ్య యాదవ్, బొల్లు వీరన్న యాదవ్, మంగి రామ్మూర్తి యాదవ్, కొండ వెంకన్న యాదవ్, జటంగి బుచ్చయ్య యాదవ్, మంగి సంపత్ యాదవ్, వల్లపు కృష్ణ యాదవ్ తో పాటు మండలంలోని యాదవ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

