Type Here to Get Search Results !

దంతాలపల్లి మండలంలో రూ.100కోట్ల తో అభివృద్ధి పనులు-రాష్ట్ర ప్రభుత్వ విప్ డా.రాంచంద్రునాయక్.

-కాంగ్రెస్ పాలనలోనే నిరుపేదల అభివృద్ధి సాధ్యం.
-పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం.
-దంతాలపల్లి మండలంలో 100 కోట్ల అభివృద్ధి పనులు.
-రాష్ట్ర ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డా.రాంచంద్రునాయక్.


సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డా.రాంచంద్రునాయక్

( నమస్తే మానుకోట-దంతాలపల్లి)

ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చిందని,రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధి కి కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మండలంలోని పెద్దముప్పారం, కుమ్మరికుంట్ల, రేపోనీ,దాట్ల గ్రామాల్లో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని, ఆహారభద్రతకు ప్రభుత్వం పెద్దపీటవేసిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ నిరుపేదలకు వరంలా మారిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొస్తున్నామన్నారు. అందులో భాగంగా ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషిచేస్తుందని , రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు,పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. మహిళలకు ఉచిత బస్సు,గ్యాసు, వడ్డీ లేని రుణాలు, సోలార్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు, రైతులకు రుణమాఫీ,రైతు భరోసా, ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుండి 10 లక్షల కు పెంపు, మొదలైన సంక్షేమ పథకాలతో పాటు దంతాలపల్లి మండలంలో 100 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.


-రాష్ట్ర ప్రభుత్వ విప్ కు ఘన స్వాగతం పలికిన బిరిశెట్టి గూడెం గ్రామస్తులు.

హైకోర్టు న్యాయవాది జెట్టి ఆజాద్ చంద్రశేఖర్ ను పార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే డా.రాంచంద్రునాయక్.

దంతాలపల్లి మండలంలోని బిరిశెట్టిగూడెం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ హైకోర్టు న్యాయవాది జెట్టి ఆజాద్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ కు సాదర ఆహ్వానం పలికారు .ఈ సందర్భంగా గ్రామంలో విడిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామ అభివృద్ధి పనులను, ప్రజలను చైతన్య పరుస్తున్న తీరుకు  ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. బిరిశెట్టిగూడెం  గ్రామాభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. సామాజిక సేవకులు,విడిసి చైర్మన్ హైకోర్టు న్యాయవాది జెట్టి ఆజాద్ చంద్రశేఖర్ కు కాంగ్రెస్ కండువా కప్పి ఎమ్మెల్యే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.



ఈ కార్యక్రమంలో డిఎస్ ప్రేమ్ కుమార్,ఆర్డీవో గణేష్, స్పెషల్ ఆఫీసర్ వీరన్న, డిప్యూటీ తహశీల్దార్ శ్రీలత,రెవెన్యూ ఇన్స్పెక్టర్ నజీముద్దీన్, ఏఈఓ దీక్షిత్ కుమార్, తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గుగులోతు భట్టు నాయక్, హైకోర్టు న్యాయవాది జెట్టి ఆజాద్ చంద్రశేఖర్ ,పిఎసిఎస్ చైర్మన్ సంపేట రాము,జిల్లా నాయకులు కొమ్మినేని రవీందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొమ్మినేని సతీష్,గ్రామ పార్టీ అధ్యక్షుడు పడిదం లింగమూర్తి,నాయకులు జానీపాషా ,మిడతపెల్లి సురేందర్,  సంపేట సురేష్ ,గురుపాల్ రెడ్డి ,లింగారెడ్డి ,పొన్నొటి బాలాజీ, ,  నవీన్ రెడ్డి, రమేష్ రెడ్డి, మల్లం శ్రీను, గీర్వాణి,వీరన్న లింగన్న,మాజీ సర్పంచ్ సూరబోయిన వెంకన్న ,రూపిరెడ్డి వెంకటరెడ్డి, మొగులగాని కొమురయ్య, రాంమల్లు,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.