హాస్టల్లలో సామాను మాయం?
షరా మామూలేనా?
(నమస్తే మానుకోట-దంతాలపల్లి):
నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం నుండి మంజూరు అయిన వంట సామాగ్రి పిల్లల బెడ్ షీట్లను ఓ వార్డెన్ మాయం చేసి విషయం బయటకు పొక్కడంతో తిరిగి హాస్టల్కు చేర్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలలోని పెద్దముప్పారం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఎస్పీ వసతి గృహంలో ఉన్న వంట సామాగ్రి, పిల్లల బెడ్ సీట్లను ఆ ఆస్టల్ నుంచి మరిపెడకు రెండు రోజుల కింద తరలించారు. ఆ విషయం బయటకి పోక్కడంతో సోమవారం తిరిగి హాస్టల్ కు అశోక్ లైలాండ్ వాహనంలో తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు హో స్టెల్లో వంట సామాగ్రి,బెడ్ సీట్లను ఇక్కడి నుండి ఎందుకు తరలించారని ప్రశ్నించగా వంట సామాగ్రి సొట్ట బుతే బాగు చేయించడానికి పంపించామనగా, బెడ్ షీట్లను ఎందుకు తరలించారు అని ప్రశ్నించగా వార్డెన్ నిర్లక్ష్యంగా పొంతన లేని సమాధానాలు చెప్పుకుంటూ తిరిగి వంట సామాగ్రి బెడ్ సీట్లను హాస్టల్లోకి చేర్పించాడని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎస్సీ పిల్లల కొరకు వసతి గృహాలు ఏర్పాటు చేసి వారి ఉన్నత చదివే దేహంగా పనిచేస్తూ ఉంటే వారికి పెట్టే అటువంటి తిండి విషయంలో, ఇతర మెయిం టెనెన్స్ ఖర్చుల విషయంలో ఇంకెన్ని అవుతవుకలు జరుగుతున్నాయోనని, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఎస్సీ సంక్షేమ హాస్టల్ పై పర్యవేక్షణ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

