ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి దళిత డైరెక్టర్ ను ఆహ్వనించని పిఎసిఎస్ అదికారులు?
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి దళితురాలైన ఓ డైరెక్టర్ ను అధికారులు ఆహ్వానించకుండా అవమానించిన ఘటన దంతాలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.దళితులు అంటే చిన్న చూపా ? రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజునే నన్ను అవమానించారంటూ దంతాలపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ దర్శనాల శైలజ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సంఘం డైరెక్టర్ గా ఎన్నికైన నాటినుండి రైతులకు పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీల నాయకులతో కలసి రైతు సమస్యలు తీర్చుటకు కృషి చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.దళిత మహిళను అని చిన్న చూపుతో చూస్తూ సోమవారం రాత్రి మండల కేంద్రంలోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్థానిక నాయకులు ఎమ్మెల్యేతో ప్రారంభించడం చాలా బాధాకరం అని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు.సంఘటనపై స్పందించిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సోమారపు లింగన్న మాట్లాడుతూ ఈ విధంగా మా దళితులను అవమాన పరిస్తే రాబోవు రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సంబంధిత అధికారులను,ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు. కార్యక్రమంలో దర్శనాల వెంకన్న,అంకం సోమేశ్వర్, దర్శనాల శ్రావణ్, హరీష్, మురళీ,దేవేందర్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

