రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
ఈ నెల 27వ తారీఖున తలపెట్టిన బిఆర్ఎస్ రజతోత్సవసభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ బిఆరెస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత,డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దంతాలపల్లి మండల కేంద్రంలో వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం 27వ తారీఖు జరుగు బిఆర్ఎస్ రజతోత్సవ సభసన్నాహాక సమావేశం ఏర్పాటుచేసి రజితోత్సవ పోస్టరు ఆవిష్కరించారు.ఈ సమావేశంలో మహబూబాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మరియు మహబూబాబాద్ పార్లమెంట్ మాజీ సభ్యులు మాలోత్ కవిత డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ మహబూబాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్ రెడ్డి ,నాయిని శ్రీనివాస రెడ్డి, నూకల గౌతం రెడ్డి, ఓలాద్రి మల్లారెడ్డి, వేణు, కిషోర్, కిషన్ నాయక్ అంకం సోమేశ్వర్ ,గుండ గాని యాకన్న, రొయ్యల సురేష్ దర్శనాల వెంకన్న పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

