(నమస్తే మానుకోట దంతాలపల్లి)
మహబూబాబాద్ జిల్లా, దంతాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త అల్లం సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని అన్నారు.

