సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం-డిప్యూటీ తహసీల్దార్ నరసయ్య
(నమస్తే మానుకోట -తొర్రూరు)సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకమని డిప్యూటీ తహసిల్దార్ నరసయ్య అన్నారు.గురువారం మండలంలోని వెలికట్ట గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానికులతో కలిసి డిటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎక్కడా లేని సన్న బియ్యం ప్రజా పంపిణీ ,తెలంగాణలో ప్రారంభమైందని తెలిపారు. ప్రతి వ్యక్తి కడుపునిండా తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సంబంధించి ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు ప్రతి కంఠం దేవేందర్ రాజు, మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు దీకొండ శ్రీనివాస్, నాయకులు అనపురం వెంకన్న గౌడ్, వీరమనేని రాజు కుమార్ ,దీకొండ ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.
Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

.jpeg)
