(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
హైదరాబాదులో ఏప్రిల్ 8 తేదీన జరుగు ధర్నాను జయప్రదం చేయాలని తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ఉడుగుల లింగన్న,దంతాలపల్లి సబ్ డివిజన్ కార్యదర్శి చిర్ర యాకన్న లు పిలుపునిచ్చారు. దంతాలపల్లి మండల కేంద్రంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు.చత్తీస్ ఘడ్ లో ఆదివాసులపై ఆదివాసి జాతి హననాన్ని ఆపాలని,నక్సలైట్లపై బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏప్రిల్ 8న హైదరాబాద్ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర జరుగు ప్రజాధర్నా ను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తొర్రూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వాల్ పోష్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ఉడుగుల లింగన్న దంతాలపల్లి సబ్ డివిజన్ కార్యదర్శి చిర్ర యాకన్న లు ప్రసంగిస్తూ జెల్ జంగిల్ జమీన్ ,హమారా హాయ్ అంటూ అడవిని ,అడవిలోని సహజ సంపదను రక్షించుకునేందుకు సాగిస్తున్న ఆదివాసీల వీరోచత పోరాటంపై క్రూర మరణకాండను నిలిపివేయాలని అన్ని వర్గాల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నామని వారన్నారు. ఆదివాసీల జీవిస్తున్న అటవీ ప్రాంతాల్లో చట్టాల విరుద్ధంగా తాము ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పాలన కొనసాగిస్తున్నారు.ఆదివాసీల సంపద అయిన అడవి పై కార్పొరేట్ శక్తుల కన్ను పడి ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న 83 రకాల ఖనిజ సంపద ను దోచుకోవడం కోసం వారికి అడ్డుస్తున్న ఆదివాసీలను ఆదివాసుల కోసం పోరాడే వారిని ప్రశ్నించే వారిని క్రూర నిర్బంధంతో ఎన్కౌంటర్లు చేస్తూ హతమారుస్తున్నారని వారన్నారు. ఆదివాసీల హక్కు అయినా ఐదవ షెడ్యూల్లో వారి పర్మిషన్ లేకుండా హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని హతమారుస్తున్నాయని వారి సంపదను దోచుకుంటున్నాయని,ఆదాని అంబానీ కంపెనీలకు పర్మిషన్ ఇవ్వడం కోసం పదివేల సైన్యంతో గ్రామాలపై ఆదివాసీలపై దాడులు చేస్తూ హతమారుస్తున్నారని వీటిని వ్యతిరేకిస్తూ ప్రజలు ప్రజాస్వామిక వాదులు పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మారపు కృష్ణ ,విజయ్ ,వెంకన్న, యాకన్న ,రాములు ,రాజయ్య ,సోమన్న ,లక్ష్మి జయమ్మ తదితరులు పాల్గొన్నారు.


