-రైతుల కష్టానికి సరైన గౌరవం కల్పిస్తున్న ప్రభుత్వం.
-పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.
-అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తా.
-బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలు సహించేది లేదు.
-పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి.
(నమస్తే మానుకోట-తొర్రూరు)
రైతుల కష్టానికి సరైన గౌరవం కల్పించడంతో పాటు, పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా నా వంతు కృషి చేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు మండలంలోని నాంచారి మడూరు గ్రామంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకువస్తున్నాం. అందులో భాగంగా, ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది.రైతుల కష్టానికి సరైన గౌరవం కల్పించడంతో పాటు, పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశ్యం. ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా నా వంతు కృషి చేస్తానని అన్నారు.అలాగే, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా అమలు కావాల్సిందిగా అధికారులను ఆదేశిస్తున్నాను. బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలు సహించేది లేదు. ప్రజలే పథక విజయానికి వంతుగా ఉండాలని అన్నారు.అనంతరం ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మండల నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

