మహత్మా జ్యోతిరావు ఫూలే ఉద్యోగి దారుణ హత్య.
(నమస్తే మానుకోట-మహబూబాబాద్ )
గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న హత్యలు,దాడులు ప్రజల్లో వణుకు పుట్టిస్తుంది.తాజాగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి లోని భజన తండా శివారు లో ఓ వ్యక్తి ని గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసినట్లుగా గుర్తించిన తండావాసులు,స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు బ్రదాచలం వాసిగా గుర్తించారు. దంతాలపల్లి మండల కేంద్రం లోని మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్ లో హెల్త్ సూపర్ వైజర్ పనిచేస్తున్నారని ,ఇటీవల వరుసగా రెండు రోజుల సెలవులు రాగా స్వగృహానికి వెళ్ళి,తిరిగి దంతాలపల్లి కి వస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు.

