-అటవి సంపదపై కార్పొరేట్ కన్ను.
-అటవి సంపదను దోచుకోవడానికే ఆపరేషన్ కగార్.
-అటవి హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు.
(నమస్తే మానుకోట-తొర్రూరు)
ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని హైదరాబాదులో ఏప్రిల్ 8న జరుగు ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ఉడుగుల లింగన్న పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా అమ్మపురం గ్రామంలో న్యూడెమోక్రసీ నాయకులు పోస్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ఉడుగుల లింగన్న మాట్లాడుతూ జెల్ జంగిల్ జమీన్ హమారా హాయ్ అంటూ అడవిని ,అడవిలోని సహజ సంపదను రక్షించుకునేందుకు సాగిస్తున్న ఆదివాసీల వీరోచత పోరాటంపై క్రూర మరణకాండను కొనసాగిస్తున్న ప్రభుత్వ నిరంకుశత్వాన్ని వ్యతిరేకించాలని అన్ని వర్గాల ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఆదివాసీలు జీవిస్తున్న అటవీ ప్రాంతాల్లో చట్టాలకు విరుద్ధంగా తాము ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పాలన కొనసాగిస్తున్నారని ,ఆదివాసీల సంపద అయిన అడవి పై కార్పొరేట్ శక్తుల కన్ను పడి ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న 83 రకాల ఖనిజ సంపద ను దోచుకోవడం కోసం వారికి అడ్డుస్తున్న ఆదివాసీలను, ఆదివాసుల కోసం పోరాడే వారిని, ప్రశ్నించే వారిని క్రూర నిర్బంధంతో ఎన్కౌంటర్లు చేస్తూ హతమారుస్తున్నారని వారన్నారు. ఆదివాసీల హక్కు అయినా ఐదవ షెడ్యూల్లో వారి పర్మిషన్ లేకుండా హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని హతమారుస్తున్నాయని వారి సంపదను దోచుకుంటున్నాయని ఆదాని, అంబానీ కంపెనీలకు పర్మిషన్ ఇవ్వడం కోసం పదివేల సైన్యంతో గ్రామాలపై ఆదివాసీలపై దాడులు చేస్తూ హతమారుస్తున్నారని వీటిని వ్యతిరేకిస్తూ ప్రజలు ప్రజాస్వామికవాదులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దొనికే ఎల్లయ్య, సోమయ్య, నాగమ్మ, సోమక్క,దర్గయ్య ,ఏసోబు,లక్ష్మి నారాయణ ,ఉప్పలమ్మ మంగమ్మ ,ఉపేంద్ర కేతమ్మ తదితరులు పాల్గొన్నారు.

