●కామ్రేడ్ రవి అన్న ఆశయాలను కొనసాగిస్తాం-న్యూడెమోక్రసీ.
●మార్చి 11న రాయల వర్థంతి సభ.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
విప్లవ మేధావి ప్రతిఘటన ఉద్యమ దళపతి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవి అన్న 9వ వర్ధంతి సభను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 11న ఖమ్మం నగరంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు,అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గోడపత్రికలను దంతాలపల్లి. మండల కేంద్రంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న. మాట్లాడుతూ తిరుమలాయపాలెం పిండిపోలు గ్రామంలో పుట్టి విద్యార్థి దశలోనే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థ వలస అర్థ భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించి ఆ స్థానంలో వ్యవసాయక విప్లవాన్ని ఇరుసుగా చేసుకుని కార్మిక వర్గ నాయకత్వాన నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలని భావించి అందుకు దీర్ఘకాలిక ప్రజాయుద్ధ అందాయే సరియైన మార్గమని అది ప్రతిఘటన ఉద్యమ సిద్ధాంత అవగాహనతోనే వీలవుతుందని 1968లో అజ్ఞాతంలోకి వెళ్లాడు గోదావరి లోయ పరివాహ ప్రాంతంలో ఆత్మరక్షణ దళాలు ఏర్పాటు చేసి ఆ దళాలకు అధిపతిగా ఉంటూ పేదలకు లక్షల లక్షలాది ఎకరాలు భూములు పంచడం జరిగింది అన్నారు అంతేకాదు దేశంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే పార్టీకి ప్రజా సంఘాలు ఉండాలని ప్రజా సంఘాలు పెట్టి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి విద్యా వైద్యం పంటలకు గిట్టుబాటు ధరలు ఫీజు రియంబర్స్మెంట్ కార్మిక సమస్యలు భూ సమస్యలు తాగునీటి కోసం సాగునీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణం కోసం అనేక పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు.రవన్న ఎంచుకున్న కర్తవ్యాన్ని పరిపూర్తి చేయటం కోసం న్యూ డెమోక్రసీ కార్యకర్తలు ముందుకు కదలాలని అలా కదిలిన రోజే ఆయనకు మన అర్పించే నిజమైన నివాళి అన్నారు.ఈ కార్యక్రమంలో. అఖిల భారత రైతు కూలీ సంఘం తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఇరుగు నాగన్న,డివిజన్ నాయకులు ఎస్ కే షాజహాన్. వల్లపు సాయిలు, వంశి,వెంకట్ రెడ్డి, వీరన్న, రమేష్, క్రాంతి యాకన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.

