●నకిలీ పురుగు మందులతో జాగ్రత్త.
●పల్లెల్లో రైతులను మోసం చేస్తున్న ముఠా.
●రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వ్వవసాయ శాఖ అదికారిణి పి.వాహిని.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
పల్లెల్లో నకిలీ మందులు అమ్ముతున్న ముఠా పట్ల రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని అలాంటివారు ఎవరైనా తారసపడితే తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని దంతాలపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారిని పి వాహిని సూచించారు ఈ సందర్భంగా వాహిని మాట్లాడుతూ ఇటీవల మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పలు గ్రామాలలో (వేములపల్లి, కు మ్మరికుంట, రేపోణి) ఓముఠా తక్కువ ధరకే మంచి కం పెనీ మందులు (పెస్టిసైడ్స్) అని చెప్పి రైతులకు నకిలీ మందులు అంట కడుతున్నారని, ఈ ముఠాకు సంబంధించిన తుంగతుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి గ్రామాలలో తిరుగుతూ రైతులను నేరుగా సంప్రదించి మందులను అమ్ముతున్నట్లుగా గుర్తించామని, ఇతని పై పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యిందని, కావున రైతులెవరు ఇలాంటి వ్యక్తులు అమ్మే నకిలీ మందులను కొనుగోలు చేసి మోసపోకూ డదని రైతులకు సూచించారు. కొంతమంది కాసులకు కక్కుర్తి పడి అమాయక రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు, అను మతులు లేని పురుగుమందులను అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారని, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అమ్మినా, నిలువ చేసిన, రవాణా చేసిన, నకిలీ దందా చేసినట్లు తెలిసిన కేసులు నమోదు చేయిస్తామనిహెచ్చరించారు. ఎవరైనా గ్రామాల్లో తిరుగుతూ మందులను అమ్మే ప్రయత్నం చేస్తుంటే వెంటనే వ్యవసాయశాఖకుగాని, పోలీసు శాఖకి సమాచారం ఇవ్వాలని సూచించారు.


