కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి
-మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్
(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే డోర్నకల్ నియోజకవర్గంలో అన్ని వ్యవస్థలలో అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జినుకల రమేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం డోర్నకల్ నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ల మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రజా పాలన వర్ధిల్లాలని కార్యకర్తలు నినదించారు.. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నాడు ఏకలవ్య గురుకుల పాఠశాల తో పాటు వివిధ సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేయడంలో డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైందని నియోజకవర్గo అభివృద్ధి చెందిందంటే నాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో నేడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి బాటలో నడుస్తుందని వారు ప్రభుత్వాన్ని కొనియాడారు. ఇప్పటికైనా జూట మాటలు ఆపి కేటీఆర్ కెసిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి పనితనం ఏంటో నేర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఆగం చేసి అగమ్య గోచరంగా మార్చిన ఘనత కేవలం కల్వకుంట్ల కుటుంబానికి చెందుతుందని వారు విమర్శించారు.. ప్రభుత్వం అప్పుల్లో ఉన్న కూడా నేడు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజల కోసమే ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని వారి పేర్కొన్నారు. త్వరలోనే నర్సింహులపేట మండల కేంద్రాన్ని మోడల్ గ్రామంగా మారుస్తామని కోటి రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. గ్రామ శాఖ అధ్యక్షులు రామకృష్ణ సీనియర్ నాయకులు అలవాల శ్రీనివాస్ గుండాల బిక్షం ఎర్ర రవి పెద్ద మముల యకన్నా,దూరు యకయ్య కొంపల్లి యకన్న రవీందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమి రెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు చిర్ర సతీష్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప్పలయ్య మధుకర్ రెడ్డి వీరన్న అవిలయ్య వెంకన్న గడిపల్లి శ్రీను అనిల్ రమేష్ వీరన్న అనిల్ మల్లయ్య రాజేష్ రాజేందర్ యూత్ కాంగ్రెస్ నాయకులు కాస యాకాన్న ఉపేందర్ గౌడ్ నిమ్మల శ్రీనివాస్ జాతంగి లింగన్న యాదవ్ ముఖేష్ మెరుగు నరేష్ ప్రవీణ్ రాజు రాంరెడ్డి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

