(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
డాక్టర్ షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదికలోని లోపాలను సవరించాలని, జనాభా దామాషా ప్రకారం మంత్రివర్గంలో ఇద్దరు మాదిగలకు చోటు కల్పించాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సోమారపు లింగన్న మాదిగ డిమాండ్ చేశారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మాదిగల ఆత్మగౌరవ డప్పు మహాప్రదర్శన కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సోమారపు లింగన్న మాదిగ ఆధ్వర్యంలో భారీగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు,నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదికలోని లోపాలను సవరించాలని, జనాభా దామాషా ప్రకారం మంత్రివర్గంలో ఇద్దరు మాదిగలకు చోటు కల్పించాలనేటువంటి డిమాండ్తో జిల్లా కేంద్రంలో తలపెట్టిన డప్పు ప్రదర్శనకు తరలి వెళుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి మధు, సోమారపు భార్గవ్ రావ్,ధర్మారపు వెంకన్న,గుండె వీరన్న,యాసారపు కమలాకర్,మల్లెపాక వెంకన్న,యాసారపు సంతోష్ బొల్లం రాజు,తప్పట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

