Type Here to Get Search Results !

కాసులు కురిపిస్తున్న బెల్ట్ దందా.....అధికారుల మౌనం వెనుక కాసుల మతలబేనా?

-వీదివీదినా ఏరులై పారుతున్న మద్యం.
-చర్యలకు వెనుకాడుతున్న ఎక్సైజ్ అధికారులు.
-వ్యాపారులకు వంత పాడుతున్నారని ప్రజల ఆరోపణ.
-మండల పరిధిలో 2 వైన్ షాపులు.
-రెండు వైన్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు మద్యం సరఫరా 
-మండల పరిధిలో 200 పైగా బెల్ట్ షాపులు.
-రిటైల్ మద్యం షాపుల వ్యాపారాలకు అడ్డగోలు లాభాలు.
-ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సోమారపు లింగన్న మాదిగ.



(నమస్తే మానుకోట-దంతాలపల్లి)

దంతాలపల్లి మండల పరిధిలో యదేచ్చగా సిండికేట్ మద్యం మాఫియా నడుస్తున్న సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు  ఏమీ సంబంధం లేనట్టుగా, చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సోమారపు లింగన్న మాదిగ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైన్ షాపుల యజమానులు అందరు కుమ్మక్కై సిండికేట్గా ఏర్పడి మద్యం మాఫియాకు తెర లేపారని,వైన్ షాపుల డ్రాలో షాపులు దక్కించుకున్న లిక్కర్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం సరఫరా చేస్తూ వైన్ షాపులకు వస్తున్న మద్యం  దాదాపు అంతా సిండికేట్ తరలిస్తుండటంతో వినియోగదారుడు బెల్ట్ షాపులలో క్వాటర్ కి 40 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని,దంతాలపల్లి మండల పరిధిలో ఉన్న 17 గ్రామపంచాయతీలో 200 పైగా బెల్ట్ షాపులు ఉన్నాయంటే మద్యం సిండికేట్ ఏమేరకు  సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.మండలంలో రెండు వైన్ షాపులు దర్శన మిస్తున్నాయి.బెల్ట్ షాపుల నిర్వహణ వల్ల రిటైల్ మద్యం షాపుల వ్యాపారులకు అడ్డగోలుగా లాభాలు వస్తున్నాయి.అయినా కూడా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమీ సంబంధం లేనట్టుగా, చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు కుమ్మక్కయ్యారని,మండలంలో మద్యం వ్యాపారులది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందని,వైన్స్ షాపులు సిండికేటుగా మారి అధిక ధరలతో విక్రయిస్తున్నా.. బెల్ట్‌ షాపులకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నా.. కృత్రిమ కొరత సృష్టించి బీర్లను వైన్స్‌ షాపుల నుంచి బెల్ట్ షాపులకు తరలించి అమ్మకాలు చేస్తున్నా.. వారిని అడిగే నాథుడే కరువయ్యాడు. వాటన్నింటినీ నియంత్రించాల్సిన ఎక్సైజ్‌ అధికారులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై ప్రజల నుండి  అనుమానాలతో పాటు,విమర్శలు వస్తున్నాయని అన్నారు. సంబంధిత ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకొనట్లయితే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి మధు, సోమారపు భార్గవ్ రావ్,ధర్మారపు వెంకన్న,గుండె వీరన్న,యాసారపు కమలాకర్,మల్లెపాక వెంకన్న,యాసారపు సంతోష్ బొల్లం రాజు,తప్పట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.