నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
నిబంధనలకు విరుద్ధంగా, వ్యాపారాలు నిర్వహిస్తూ, ప్రజలను దోపిడీకి గురిచేస్తున్న మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు లింగన్న అధికారులను కోరారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని ఓ వైన్స్ షాప్ ముందు సోమవారం మద్యం ప్రియులు ఆందోళన నిర్వహించారు.వైన్స్ షాప్ కు వచ్చిన మద్యం ప్రియులకు నిరాశ ఎదురవుతుందని, వైన్స్ షాప్ యాజమాన్యం తీరుపై మద్యం ప్రియులు బగ్గుమంటున్నారని కావలసిన బ్రాండ్ ఏది అడిగినా వైన్స్ షాప్ సిబ్బంది లేదని చెప్పుతూ, మాముందే బెల్ట్ షాపులకు అధిక ధరలకు విక్రయిస్తూ బెల్ట్ షాపులతో కుమ్మక్కై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, మేము అడిగితే లేదని బెల్ట్ షాపులకు ఎలా ఇస్తున్నారు అని అడిగితే మేము అలాగే ఇస్తాము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని నిర్లక్ష్యపు సమాధానం చెబుతూ, విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వైన్ షాప్ ముందు ఎస్సీ కాలనీకి ప్రధాన రహదారి అయినటువంటి దారిలో మద్యం తాగి వచ్చిన వ్యక్తులు మలవిసర్జన చేస్తూండటం తో అటువైపు వెళుతున్న మహిళలకు, ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని, ఆ సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులకు దుర్వాసన వస్తూ చాలా అనారోగ్యాల పాలవుతున్నామని, అందువల్ల నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి కౌన్సిక్ వైన్స్ ను అక్కడనుండి మార్చాలని కోరుకుంటూ కాలనీవాసులు మండల పరిషత్ అధికారి అప్సర్ పాషాకు వినతి పత్రం ఇచ్చారు.

