దంతాలపల్లి లో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం.
(నమస్తే మానుకోట దంతాలపల్లి)
వై ఆర్ జి కేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి జానపద కళా నృత్యాలను ప్రదర్శించారు దీనిలో భాగంగా ఎయిడ్స్ అంటువ్యాధి కాదని రక్షణ లేని సెక్స్ చేయడం వలన కలుషితమైన రక్తమార్పిడి ద్వారా అపరిశుభ్రంగా ఉన్న సూదులు చిరంజీవి ద్వారా వ్యాధిగ్రస్తురాలైన తల్లి నుండి బిడ్డకు మాత్రమే ఎయిడ్స్ సోకే ప్రమాదం ఉందని ప్రజలు ఎయిడ్స్ పట్ల అవగాహనను పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఆర్జి కేర్ సంస్థ నిర్వాహకులు సంధ్య సౌందర్య మరియు కళాకారులు కొనపాక రమేష్ అర్జున్ రవి చిరంజీవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

