Type Here to Get Search Results !

అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవ సభలను వాడవాడలా జరపండి-పగిడిపాల తిరుపతక్క - పి.ఓ.డబ్ల్యూ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు.

అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవ సభలను వాడవాడలా జరపండి-పగిడిపాల తిరుపతక్క
- పి.ఓ.డబ్ల్యూ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు.


(నమస్తే మానుకోట-దంతాలపల్లి)

పెద్దముప్పారం గ్రామంలో సభలో మాట్లాడుతూ.ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యూ) జిల్లా అధ్యక్షురాలు. తిరుపతక్క మాట్లాడుతూ    మార్చి 8 మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా పి.ఓ.డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు తిరుపతమ్మ.పాల్గొని మాట్లాడుతూ... దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా స్త్రీ, పురుషుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం లేదని, రోజు రోజుకు మహిళలపై హింస, దాడులు, అణిచివేత పెరుగుతున్నాయని, వీటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వ పాలనలో మూఢత్వ, అంద విశ్వాసాలు, పితృ స్వామిక భావాజాలం బలపడుతుందని, వీటిని పెంచిపోషిస్తున్నారని అన్నారు. మహిళ హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న మహిళా కార్యకర్తలపై రాజ్యం ఉపా చట్టాలను ఆపాదిస్తూ ప్రజాస్వామిక హక్కులను కాల రాస్తున్నారని అన్నారు. మహిళలంతా ఐక్యంగా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలపై పోరాడాలని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 న గ్రామ గ్రామాన సభలు, సమావేశాలు జరపాలని పిలుపునిచ్చారు. మహిళలు అన్ని రకాలలో స్వతంత్ర్యంగా ఎదిగేలా ప్రోత్సాహకాలు అందించాలని, శ్రమకు తగిన కూలీ ఇవ్వాలని, ఉపాధి హామీ పనులలో గాయపడిన వారికి ప్రభుత్వమే ఆదుకోవాలని, రోజువారీ కూలీ 600లకు పెంచాలని, అన్ని రకాల పనిముట్లు అందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి.ఓ.డబ్ల్యూ తొర్రూరు.డివిజన్ నాయకురాలు కనకమ్మ ఐలమ్మ గోడిశాల సునీత కమలమ్మ మరియమ్మ ధర్మారపు అలివేలు, తీగల సోమక్క, ఈదురు ముత్తిలింగమ్మ,కందుకూరి భాగ్యమ్మ జ్యోతి రామతర స్వరూప గడ్డి శ్రీలత పద్మ . సరోజన, కమలమ్మ, కనకమ్మ , ఎలిశాల అచ్చమ్మ భాగమ్మ డ్రైవర్, బేతమల్ల  లక్ష్మి, గంట రామనర్సమ్మ, మల్లమ్మ జక్కల తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.