దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో యాదవులు ఐక్య ఉద్యమాలు చేయాలి.
-రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య.
-విగ్రహ దాత తండా ఉపేంద్ర యాదవ్.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహా ప్రతిష్టాపన కొరకు దంతాలపల్లి మండలంలోని యాదవులు ఉత్సాహంతో ముందుకు రావడంతో, దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో రాష్ట్రంలోని యాదవులందరూ ఐక్య ఉద్యమాలు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాంలో భాగంగా శుక్రవారం యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు తండా ఉపేంద్ర యాదవ్ పాల్గొని దొడ్డి కొమరయ్య విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యుల కోరిక మేరకు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో తయారు చేసి ఇస్తానని దొడ్డి కొమురయ్య విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యుల సమక్షంలో తెలిపడం జరిగింది. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు తండా ఉపేంద్ర యాదవ్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో యాదవులందరినీ కలుపుకొని యాదవుల గొప్పతనాన్ని తెలుపుతూ యాదవ సమాజ అభివృద్ధి కోసం, సామాజికంగా రాజకీయంగా ఎదిగే విధంగా తమ వంతు పోరాటాలు చేస్తామని, అడిగిన వెంటనే దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పిన ఉపేంద్ర యాదవ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమరయ్య విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు ఉడుగుల ఐలేష్ యాదవ్, ఆవుల సురేష్ యాదవ్, బొల్లు వీరన్న యాదవ్, గుండాల ఐలయ్య యాదవ్, కొండ వెంకన్న యాదవ్, బెల్లి సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


