ఉస్మానియా యూనివర్సిటీ వృక్షశాస్త్రము విభాగంలో మిడతపల్లి చిరంజీవికి డాక్టరేట్.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
ఉస్మానియా యూనివర్సిటీ నుండి వృక్ష శాస్త్ర విభాగంలో మిడతపల్లి చిరంజీవి డాక్టరేట్ ను అందుకున్నారు.డాక్టర్ ఛాయా పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రంలోని గుర్తించదగిన ఔషద మొక్కల పుప్పొడి వైవిధ్యం వాటి ప్రయోజనాలపై జరిపిన పరిశోధనలకు గానూ డాక్టరేట్ ను అందుకున్నారు.మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బిరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి పట్టుదలతో ,ఉన్నతచదువులు చదివి డాక్టరేట్ సాధించడం అభినందనీయమని గ్రామస్తులు హర్షంవ్యక్తం చేశారు.మిడతపల్లి చిరంజీవి, ముత్యం, భద్రమ్మ ల కుమారుడు వీరిది వ్యవసాయ కుటుంబం. చిరంజీవి ప్రాథమిక విద్యను స్వగ్రామంలో, 7 నుండి 10 వ తరగతి నర్సంపేట సోషల్ వెల్ఫేర్ లో ఇంటర్మీడియట్ స్టేషన్ ఘనపూర్ సోషల్ వెల్ఫేర్ లో, బిఎస్సీ ,బిఈడి, ఎమ్మెస్సీ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం ఈ డి - ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తి చేశారు.పీహెచ్ డి ఉస్మానియా యూనివర్సిటీ నుండి పూర్తి చేశారు.వివిధ జాతీయ,అంతర్జాతీయ సెమినార్ లలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పరిశోధనలో సహకరించిన ప్రొఫెసర్ లకు మరియు హైకోర్టు న్యాయవాది ఆజాద్ చంద్రశేఖర్ కు మరియు మిత్రులు మనోజ్ కుమార్, టి శ్రీను మరియు కోస్కాలర్స్ జీవన్ కుమార్, నవీన్ కుమార్, చంద్రబాబు, శబ్నం కి ధన్యవాదాలు తెలిపారు.ఉన్నత విద్య పరిశోధనలో భాగంగా యు జి సి ఫెలోషిప్ అందించడం జరిగింది. అందుకుగా ను యూజీసీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ మెగా & ఒమేగా కాలేజ్ లో బోటనీ సీనియర్ లెక్చరర్ గా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు, అధికారులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.
.

