Type Here to Get Search Results !

యాదవుల సమగ్ర అభివృద్ధి కి కృషి చేస్తాం

◆తెలంగాణ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గా ఐలేష్ యాదవ్.
◆రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొండా వెంకన్న యాదవ్.
◆నియామక పత్రం అందజేసిన అధ్యక్షులు తండ ఉపేంద్ర యాదవ్.

(నమస్తే మానుకోట-దంతాలపల్లి)

స్థానిక మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ యాదవ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకురాలు, రాష్ట్ర అధ్యక్షులు తండా ఉపేంద్ర యాదవ్ హాజరై వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి యాదవులు ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్నప్పటికీ సామాజికంగా రాజకీయంగా అనుకున్న స్థాయిలో అభివృద్ధి కాలేదని, హిందూమతంలోని భగవద్గీతను ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీకృష్ణుని వంశానికి చెందిన యాదవులు గత కొన్ని వేల సంవత్సరాల క్రితం రాజులుగా, రాజ్యాధిపతులుగా చంద్రవంశ చక్రవర్తులుగా రాజ్యాలనే లేనటువంటి నీతికి నిజాయితీకి మారుపేరుగా ఒక బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులు క్రమ క్రమంగా రాజ్యాధికారాన్ని కోల్పోయి ఇప్పుడున్న రాజకీయాలకు, రాజకీయ నేతలకు సలహాదారులుగా, సూత్రధారులుగా, రెండవ  స్థాయి లీడర్లుగా మిగిలిపోయినటువంటి యాదవులు రాబోయే రోజుల్లో గత తరతరాల చరిత్రను పునికి పుచ్చుకొని కిందిస్థాయి వార్డు మెంబర్ల నుండి రాష్ట్రంలో అత్యున్నతమైన స్థాయి ముఖ్యమంత్రి వరకు యాదవ బిడ్డలు ఎదగాలని వారు అన్నారు. అటువంటి స్థాయికి ఎదగాలంటే గ్రామస్థాయి నుండి యాదవులను చైతన్యవంతం చేస్తూ మన చరిత్రను గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి చేరదీస్తూ రాష్ట్రంలో ఉన్న యాదవులందరినీ చైతన్యవంతం చేసే విధంగా యాదవ హక్కుల పోరాట సమితి పనిచేస్తుందని తెలిపారు. యాదవుల్ని చైతన్యవంతులుగా చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో యాదవ హక్కుల పోరాట సమితిని బలోపేతం చేసేందుకు యాదవ హక్కుల పోరాట సమితి సంఘాన్ని రాష్ట్రంలో నలుమూలల బలోపేతం చేస్తూ యాదవ సమాజాన్ని అభివృద్ధి చేసే దిశలో భాగంగా అటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకెళ్లాలని యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఊడుగుల ఐలేష్ యాదవ్ కు బాధ్యతలు అప్పగిస్తూ వారికి నియామక పత్రాన్ని అందజేశారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొండా వెంకన్న యాదవ్ ని నియమించారు.ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన ఐలేష్ యాదవ్ మాట్లాడుతూ నా పైనమ్మకంతో, నాకు ఈ బాధ్యతలు అప్పగించిన తెలంగాణ యాదవ హక్కుల పోరాట సమితి ఫౌండర్& అధ్యక్షులు తండా ఉపేంద్ర యాదవ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో యాదవ సమాజాన్ని రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేసే దిశగా నా వంతుగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నాపై ఉంచిన  నమ్మకాన్ని వమ్ము  చేయకుండా రాష్ట్రంలోని యాదవ జాతిని మొత్తం ఏకం చేసి రాజ్యాధికారం వైపు అడుగులేసే దిశగా పయనిస్తానని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదవులు ఆవుల సురేష్ యాదవ్, గుండాల ఐలయ్య యాదవ్, బొల్లు వీరన్న యాదవ్, బెల్లి సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.