- మంత్రివర్గంలో డాక్టర్ రామచంద్రనాయక్ కు అవకాశం కల్పించాలి-యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఆవుల సురేష్ యాదవ్.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
విద్యావంతుడు స్నేహశీలి మృదుస్వభావి నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు డాక్టర్ రామచంద్రనాయక్ కు మంత్రివర్గంలో డాక్టర్ రామచంద్రనాయక్ కు అవకాశం కల్పించాలని యూత్ కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి ఆవుల సురేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అదిష్టానాన్ని ,సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు.సురేష్ ఓ ప్రకటనలో మాట్లాడుతూ 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి గ్రామ,గ్రామన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన నాయకుడు రామచంద్రునాయక్ అని కొనియాడారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలను దగ్గరుండి చూసిన నాయకుడు మంత్రి పదవిలో ఉంటే, ప్రజల కష్టాలని తీరుతాయని,32 లక్షల మంది ఉన్న లంబాడ జాతికి న్యాయం జరగాలంటే నిత్యం జాతి ప్రయోజనాల కోసం కృషి చేసే నాయకుడు డాక్టర్ రామచంద్రనాయక్ కు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు.
తన వైద్య వృత్తిలో స్వయంగా పేదల కష్టాలను చూసి చలించి వారి కష్టాలను తీర్చడానికి రాజకీయంగా అడుగుపెట్టి ప్రతిక్షణం వారికి అండగా నిలిచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అత్యధిక మెజార్టీగా గెలిచిన ప్రజా నాయకుడు డాక్టర్ రామచంద్రనాయక్ అని,అత్యధిక గిరిజనులు ఉన్న నియోజకవర్గం నుండి గెలిచిన ఎమ్మెల్యే కు మంత్రి పదవి ఇస్తే నేరుగా గిరిజనులకు ఇచ్చినట్టు అవుతుందని అన్నారు.
విద్యా, వైద్యం,సామాజిక ఆర్థిక రంగాలపై , విశేష అవగాహన కలిగిన నాయకుడు డాక్టర్ రామచంద్రనాయక్ కు మంత్రి పదవి ఇవ్వాలని, మల్లికార్జున కర్గే , సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర మంత్రి వర్గాన్ని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.

