-ఉపాధి కూలీలకు తగిన వసతులు కల్పించాలి.
-సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తోరూర్ డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న.
(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
ఉపాధి కూలీలకు తగిన వసతులు కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తోరూర్ డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న అన్నారు.ఈ సందర్భంగా నరసింహుల పేట మండలం పరిధిలో బొజ్జన్నపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఉడుగుల లింగన్న దంతాలపల్లి సబ్ డివిజన్ కార్యదర్శి చిర్రయాకన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఊడుగుల లింగన్న చిర్ర యాకన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ నిధులను తగ్గిస్తూ పథకాన్ని రద్దు చేసే కుట్ర చేస్తుందన్నారు కూలీలకు కనీస వేతనం కింద 600 రూపాయలు పని ప్రదేశంలో తాగునీరు మెడికల్ కిట్ నీడ వసతి ఏర్పాటు చేయాలని సూచించారు ప్రతి గ్రూపుకు ఒక మేట్ ని ఏర్పాటు చేయాలని జాబ్ కార్డు లేని ప్రతి ఒక్కరికి తక్షణమే కార్డులు మంజూరు చేయాలని కనీస ఉపాధి హామీ రోజులను వంద నుండి 200 రోజులకి పెంచాలని డిమాండ్ చేశారు వేసవిలో ఎండలను దృష్టిలో పెట్టుకొని కొలతలతో సంబంధం లేకుండా కనీసం 500 రూపాయలు చెల్లించాలని ప్రమాదవశాత్తు కూలీలకు ప్రమాదం సంభవిస్తే వారికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు పని ప్రదేశంలో మరణిస్తే మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వారం వారం క్రమం తప్పకుండా మాస్టర్ స్లిప్ లు అందించాలని రెండు వారాలకు ఒకసారి డబ్బులు పడేవిధంగా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతుకూలీ సంఘ ఉమ్మడి నరసింహుల పేట. మండలం అధ్యక్షులు ఎస్ కే సాజన్ డివిజన్ నాయకులు నాగలి శ్రీను ముఖేష్ బేతమల్ల యాకయ్య వెంకటయ్య అంజలు వెంకయ్య సత్తమ్మ ఉప్పలమ్మ వెంకటయ్య మెరుగు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


