జయపురం గ్రామానికి ఫ్రీజర్‌బాక్స్ బహూకరించిన వంగాల ట్రస్ట్ నిర్వాహకులు.
(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి వంగాల ప్రవీణ్ కుమార్ (వంగాల వారి ఉమ్మడి కుటుంబం & వంగాల వారి చారిటబుల్ ట్రస్ట్) సుమారు లక్ష రూపాయల వ్యయం తో ఫ్రీజర్‌బాక్స్( శీతలీకరణ శవపేటిక) ను బుధవారం జయపురం గ్రామపంచాయతీ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయపురం ఉమ్మడి గ్రామపంచాయతీలోని ఎవరైనా చనిపోతే ఈ ఫ్రీజర్ బాక్స్ ను వాడుకోగలరు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మందుల యాకన్న, జంపాల బిక్షం, రిటైల్ టీచర్ వీరారెడ్డి, అశోక్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రావుల శ్రీనివాస్, వీరబోయిన సురేష్, జాఫర్, కసిరెడ్డి లింగారెడ్డి, పోశాల శ్రీనివాస్, చెన్నారెడ్డి, బుచ్చిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, దేశగాని అశోక్, కరోబార్ అన్నంగి శేఖర్, గ్రామపంచాయతీ సిబ్బంది అనిల్, వీరన్న, ఉప్పలయ్యవంగాల కుటుంబానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

