-అనాథ వృధ్దురాలికి అంత్యక్రియలు నిర్వహించిన సామాజిక విద్యావేత్త సేను రాజేష్.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
ఆధునిక యుగంలో బంధాలు ,బంధుత్వాలకు నీళ్లు వదులుతూ, రక్త సంభందికులే.రాబందులుగా మారుతున్న ఈ కాలంలో ఓ అనాథ వృద్ధురాలి మృతదేహానికి స్వచ్ఛందంగా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు దంతాలపల్లి కి చెందిన సామాజిక కార్యకర్తలు సేను బ్రదర్స్.వృధ్దురాలికి అన్నీ తామై హిందూ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరిపి ఉదారత్వాన్ని చాటారు. గత 30 సంవత్సరాల క్రితం కోనేటి చిన్న సోమక్క (68)అనే వికలాంగురాలు మండల కేంద్రానికి చెందిన వరుసకు కోడలు అయినటువంటి సేను కమలమ్మ చేరదీసి జీవనోపాధి కల్పించి, బతుకుదెరువును ఏర్పరచగా, కమలమ్మ ముగ్గురు కుమారులైన సేను రమేష్,సురేష్,సామాజిక విద్యావేత్త సేను రాజేష్ ముగ్గురూ సోమక్క బాగోగులు చూసుకునేవారు. సొమక్క మంగళవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందగా అన్ని ముందుండి రమేష్,రాజేష్ సోదరులు దహన సంస్కారాలను నిర్వహించారు.కాగా విద్యార్థి దశ నుండి రాజేష్ సేవాతత్పరత పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆపద అంటే ఇట్టే వాలిపోయి తోచిన సహాయాన్ని అందించే మానవతావాది సేవలు భవిష్యత్ లో దంతాలపల్లి మండలానికి అవసరమని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రాజేష్ సోదరుల ఉదారత్వానికి దంతాలపల్లి మండల ప్రజలు అభినందిస్తున్నారు.అంతిమ యాత్రలో మార్త శ్రీనివాస్, అక్కర వెంకటేశ్వర్లు, కారుపోతుల రాము,చీకటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.


