Type Here to Get Search Results !

డాక్టర్ల నిర్లక్ష్యం వలన కడుపులోనే పసిబిడ్డ మరణం?

-డాక్టర్ల నిర్లక్ష్యం వలన కడుపులోనే పసిబిడ్డ మరణం?
నిర్లక్ష్యం వహించిన డాక్టర్ మరియు డ్యూటీ సమయంలో విధులు నిర్వర్తించిన  సిబ్బంది లను వెంటనే సస్పెండ్ చేయాలి.
-ఆసుపత్రి సూపరిండిండెంట్, ఆర్ ఎం ఓ లు పూర్తి బాధ్యత వహించాలి.
-పదుల సంఖ్యలో జిల్లా కలెక్టర్ కు మరియు డిఎం హెచ్ ఓ కు కంప్లైంట్ చేసిన ఫలితం లేదు.
-భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
-రోడ్డు పై బైఠాయించి ఆందోళన నిర్వహించిన గిరిజన సంఘాల నాయకులు.


(నమస్తే మానుకోట-మహబూబాబాద్)

పురిటి నొప్పులతో  వచ్చిన గర్బణీ కి డాక్టర్లు అత్యవసర  వైద్యం అందించకుండా  సిబ్బంది తో ప్రాథమిక వైద్యం అందించడంతో కడుపులో బిడ్డ మరణించిందని ,నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఎల్ హెచ్ పి ఎస్ ,మరియు గిరిజన సంఘాల నాయకులు రోడ్డు పై బైఠాయించి ఆందోళన నిర్వహించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చోటుచేసుకుంది.శనిగపురం శివారు బట్టు తండా కు చెందిన బానోత్ జయశ్రీ గిరిజన పేద మహిళ పురిటి నొప్పులు భరించలేక మానుకోట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కి రాత్రి సమయం 11 గంటలకు తీసుకువస్తే డ్యూటీలో ఉన్న డాక్టర్ నిర్లక్ష్యం వహించి కేవలం ఏఎన్ఎం లతో ప్రథమ చికిత్స చేయించడం వలన రాత్రి మూడు గంటల వరకు కూడా డాక్టర్ ఆమెను చూడడానికి రాకపోవడంతో పురిటి నొప్పులు భరించలేక కడుపులో ఉన్న మగ బిడ్డ పసికందు మరణించడం జరిగిందని ఆరోపించారు.ఇది జరిగి దాదాపు 12 గంటలు కావచ్చిన కూడా ఉదయం 11 గంటల సమయంలో లంబాడి హక్కుల పోరాట సమితి తో పాటు సేవాలాల్ సేన కుల సంఘాలతో రోడ్డుపై బైఠాయించిన కూడా జిల్లా యంత్రాంగం స్పందించడం లేదని ఆందోళన నిర్వహించారు.గిరిజన పేద మహిళ కుటుంబానికి న్యాయం చేస్తూ బాధ్యులైన మరియు విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యులతో పాటు ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది లను వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.లేనియెడల రెండు రోజులలో జిల్లా డి ఎం హెచ్ ఓ కార్యాలయాన్ని వేల మందితో ముట్టడి చేస్తామని  లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ హెచ్చరించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.