నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ జైలును తెలంగాణ జైళ్ల శాఖ డీఐజీ మాధారపు సంపత్ కుమార్ శుక్రవారంనాడు సందర్శించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చిన డీఐజీ సంపత్ కుమార్ కు వరంగల్ జిల్లా సబ్ జైళ్ల అధికారి విజయ్ డేనీ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జైలు అంతా కలియతిరిగారు. ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాలు, జైల్లో అమలు చేస్తున్న పద్ధతుల విషయాలను సబ్ జైలు జైలర్ మల్లెల శ్రీనివాసరావు డిఐజికి వివరించారు. జైల్లో పరిశుభ్రత, పచ్చటి వాతావరణం, ఖైదీల సంక్షేమం పట్ల డీఐజీ సంతృపి వ్యక్తంచేశారు. ఖైదీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సబ్ జైలు అధికారులు డీఐజీ సంపత్ కుమార్ కు ఆత్మీయ సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జైలు ఉన్నతాధికారులు పట్టేం భిక్షపతి, సిటిజన్ ఫోరమ్ సభ్యులు శంతన్ రామరాజు
సదా నిరంజన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.jpg)
.jpg)