నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, సంబంధిత అధికారులతో కలిసి ఎల్ఆర్ఎస్ పై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు,
మహబూబాబాద్ జిల్లాలోని మున్సిపల్, గ్రామపంచాయతీ పరిధిలలో దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ లను క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాల వారీగా పరిశీలించి ఇలాంటి సమస్యలు లేని దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు,
ఇరిగేషన్ శాఖ వారు ఎఫ్ టీ ఎల్, రెవెన్యూ ప్రభుత్వ భూమి చెరువు శికం, దేవాదాయ నాలా, తదితర భూములను, పరిశీలించాలని, మున్సిపల్ పంచాయతీ సిబ్బంది డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ పరంగా పరిశీలించాలన్నారు,
దరఖాస్తుదారులకు జాయింట్ సర్వే బృందం ముందస్తు సమాచారం తెలిపి క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు వాస్తవాలను గుర్తించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అందుకుగాను ఎల్ వన్, ఎల్ టు, బృందాలు యాక్షన్ ప్లాన్ ప్రకారం విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు,
ఈ సమీక్షా సమావేశంలో మహబూబాబాద్ తొర్రూర్ ఆర్డీవోలు అలివేలు నరసింహారావు, డిపిఓ హరిప్రసాద్, డిటిసిపి సాయిరాం, తహసిల్దార్లు,మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్, అధికారులు ఎంపీ ఓలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు

