Type Here to Get Search Results !

మహబూబాబాద్ జిల్లాలో అపన్న హస్తానందిస్తున్న కిసాన్ పరివార్.

◆మహబూబాబాద్ జిల్లాలో అపన్న హస్తానందిస్తున్న కిసాన్ పరివార్.
◆దీనుల బాంధవులుగా నిలుస్తున్న భూపాల్ నాయక్ సైన్యం.
◆సిరి సంపదలు,సకల సౌకర్యాలు వదిలి పల్లెబాట పట్టిన డాక్టర్ వివేక్, భూపాల్ నాయక్.
◆నిరుపేదల కన్నీటిని తుడిచే హస్తమవుతున్న మహానుబావులు.
◆నిరుపేదలే కుటుంబ సభ్యులు, అభాగ్యులే బందువులు గా ముందుకు సాగుతున్న కిసాన్ పరివార్ బృందం.



(నమస్తే మానుకోట న్యూస్-చిన్నగూడూరు)మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత పది ఏళ్ళుగా నిరుపేదలు,అభాగ్యులకు అండగా నిలిస్తూ కిసాన్ పరివార్ సేవలందిస్తోంది. అయినవారే ఆదుకోలేని సమయంలోనూ అన్నీ తానై అభాగ్యులకు అండగానిలుస్తున్నారు.డోర్నకల్ నియోజకవర్గంలో  కిసాన్ పరివార్ వ్వవస్థాపకులు ననావత్ భూపాల్ నాయక్ ,ఆసంస్థ సీఈఓ డా.వివేక్ ప్రజలకు ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు.నాటి కరోనా సమయం నుండి నేటి  వరదల వరకు బాదితులకు అండగా నిలుస్తున్నారు.ఎంతో మందికి ఆసుపత్రులలో మెరుగైన వైద్యాన్ని అందించి వాటి మనుస్సుల్లో కొలువై ఉన్నారు.తాజాగా మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ అబ్బాస్ మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న కిసాన్ పరివార్ కోఆర్డినేటర్ లు ,సీఈఓ వివేక్ దృష్టికి తీసుకెళ్లారు.మృతునికి భార్య గతంలోనే అనారోగ్యంతో మృత్యువాత పడటంతో ,కూలిపనులు చేస్తూ ముగ్గురు కుమారులను పెంచి పోషిస్తున్నారు. తండ్రి మృతితో వారు అనాథలయ్యారు.చలించిన డా.వివేక్ వివరాలు తెలుసుకుని వెంటనే వారికి సహాయాన్ని అందించడానికి ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో కిసాన్ పరివార్ బృందం  సోమవారం వారి ఇంటికి వెళ్ళి అనాథలైన కుమారులను ఓదార్చారు. అండగా ఉంటామని ఏకష్టం వచ్చిన కిసాన్ పరివార్ తలుపుతట్టండని సూచించారు. అనంతరం ఆర్థిక సహాయాన్ని అందించారు. కాగా కిసాన్ పరివార్ ఉదారత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ పరివార్ జిల్లా కోఆర్డినేటర్ హరిబాబు, నరసింహుల పేట మండల కోఆర్డినేటర్ సిహెచ్ గణేష్ , చిన్న గూడూరు కోఆర్డినేటర్ శంకర్ నాయక్, మరిపెడ బంగ్లా కోఆర్డినేటర్ వెంకన్న, వెంకటేశ్వర్లు, శిరోల్ మండల్ కోఆర్డినేటర్ విష్ణు నాయక్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ శివ వర్మ, ఫార్మ్ టీం, వెంకటరమణ, యుగంధర్, మహేష్, పుల్లయ్య, వీరయ్య, కిసాన్ పరివార్ టీం, తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad