నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలోని డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచందర్ నాయక్ ఎస్ డీ ఎఫ్ ప్రత్యెక నిధుల నుంచి గ్రామ ప్రధాన కూడళ్లలో రెండు హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేశారు...
కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బాల్లె ఐలయ్య కొబ్బరీ కాయ కొట్టి హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు
ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ
ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వ వచ్చిన మూడు నెలల్లోనే జయపురం గ్రామ బీసీ కాలనీలో 5 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేశామని తెలిపారు
ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు నెలకుర్తి అశోక్ రెడ్డి, వెంకట్ రెడ్డి,జెట్టి బిక్షం,రాసమల్ల వెంకన్న, దేశగాని అశోక్, మందుల వెంకన్న, నరేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


