◆సబ్ స్టేషన్ ఆపరేటర్ల 'తల'పై ప్రాణగండం.
◆క్షేత్రస్థాయి సిబ్బందికి 'శిరస్త్రానాలు(హెల్మెట్)'అందించడంలో పై అధికారుల నిర్లక్ష్యం.
◆బిక్కు బిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లు.
(నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్ )
ప్రజలకు నిరంతర విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి విద్యుత్ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది కృషి ఎనలేనిది. ప్రత్యేకించి అకాల వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్కు అంతరాయం కలిగినప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ తమ పరిధిలో విద్యుత్ పునరుద్ధరణకు కృషి చేస్తుంటారు. పగలు రాత్రి తేడా లేకుండా చెట్లు గుట్టలు చెరువులు లెక్కచేయకుండా విద్యుత్ పనులు చేపడతారు. విద్యుత్ సబ్ స్టేషన్ లలో కూడా నిరంతరం ఆపరేటర్లు తమ ప్రాణాలను పణంగా పెడుతూ విధులు నిర్వహిస్తుంటారు. కాగా విద్యుత్ శాఖ నుండి సిబ్బందికి సరైన రక్షణ కవచాలు అందించడంలో కొంతమంది అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఉన్నతాధికారులు విధులు ముగియగానే ఇంటికి వెళ్లి పోతారు. కానీ 24 గంటలు విద్యుత్ సబ్ స్టేషన్లలో విధులు నిర్వర్తించే సిబ్బందికి మాత్రం విధి నిర్వహణ ప్రాణ సంకటమే. తాజాగా జిల్లాలోని పలు సబ్ స్టేషన్లలో సిబ్బందికి రక్షణ కవచాలైన శిరస్తానం(హెల్మెట్)లు లేకుండానే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా వ్యవస్థ చిన్న భిన్నమైంది. కాగా సబ్ స్టేషన్లలో జరిగే మార్పులకనుగుణంగా ట్రాన్స్ఫార్మర్స్ లను ఆపరేట్ చేయడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు నిప్పు రవ్వలు,మంటలు మరికొన్ని సంఘటనలలో విద్యుత్ తీగలు సైతం తెగిపడే అవకాశాలు ఉన్నాయని క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సబ్ స్టేషన్ ఆపరేటర్లకు సరైన రక్షణ కవచాలతో పాటుగా చిరస్త్రానాలను అందించాలని కోరుతున్నారు.


