Type Here to Get Search Results !

ఆర్డీవ్సో, తహసిల్దార్స్, ఎన్నికల విభాగం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

 నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్ 


కలెక్టరేట్ మీనీ సమావేశ మందిరంలో రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసిల్దార్స్ ఎన్నికల విభాగం సిబ్బంది, తో జిల్లాలో జరుగుతున్న ఎలక్ట్రోల్ నమోదు, ఇంటింటి సర్వే, పోలింగ్ స్టేషన్ నిర్వహణ ఏర్పాటు, స్వీప్ ఆక్టివిటీస్, ఓటరు జాబితా మార్పులు, చేర్పులు, పరిశీలన తదితర అంశాలపై *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* తో కలిసి *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఐఏఎస్,* సమీక్షా సమావేశం నిర్వహించారు, 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించి ఓటరు జాబితా ప్రకారం స్థానికంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి తిరుగుతూ జాబితాను సరిచేయాలని, మరణించిన వారి పేర్లు తొలగించి, అడ్రస్ చేంజ్, ఆన్లైన్లో వచ్చిన ఫామ్స్ ని విచారణ చేసి ఐటి టూల్స్ ద్వారా సరి చేయాలని,

15 వందలు ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాలు గుర్తించి మరొక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు,

ఓటరు జాబితాలోమార్పులు, చేర్పులు బిఎల్ఓ లు యాప్ ను వినియోగించి పూర్తి ఆన్లైన్ లో మాత్రమే సరిచేయాలన్నారు, 

జాబితాలో ఫోటో,అడ్రస్, సరిగా ఉందా లేదా, క్రాస్ చెక్ చేసుకోవాలని, ఒకే కుటుంబానికి సంబంధించిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు,

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి వసతులు, త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, కాంపౌండ్ వాల్, తదితర వసతులు సరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు, 

జిల్లాలో ప్రతి ఓటర్లులో చైతన్యం కల్పించడానికి స్వీప్ ఆక్టివిటీస్ ద్వారా విద్యాసంస్థలు, సామాజిక మాధ్యమాలు, బస్టాండులు తదితర రద్దీ ప్రదేశాలలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు, 

బూతు లెవెల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్, ఎన్నికల విభాగం కు సంబంధించిన రిజిస్టర్లు మెయింటైన్ చేస్తూ షెడ్యూల్ ప్రకారం ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా కార్యకలాపాలు నిర్వహించాలని, అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు,

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవిఏం) గోడౌన్ తనిఖీ చేసి, సీసీ కెమెరాలు, పరిసరాలను, పరిశీలించారు, 

అనంతరం పట్టణంలోని లెనిన్ నగర్, ఎన్జీవోస్ కాలనీ, ఇందిరా నగర్ కాలనీ, కంకర బోర్డ్, రామచంద్రపురం, గుమ్ముడూర్ ,కాలనీలలో జరుగుతున్న ఇంటింటి ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు, 

సర్వే చేస్తున్న బిఎల్ఓస్ స్నేహ, సాబీరా, రోజాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి, ఓటరు జాబితా, స్వీప్ ఆక్టివిటీస్, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, తదితర అంశాలపై జిల్లాలో తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు, 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, మహబూబాబాద్,తొర్రూర్ ఆర్డీఓలు ఎల్.అలివేలు, జి .నరసింహారావు, కలెక్టరేట్ ఏ.ఓ పవన్ కుమార్, మహబూబాబాద్ తాసిల్దార్ భగవాన్ రెడ్డి, జిల్లాలోని అన్ని మండలాల తహసిల్దార్, ఎన్నికల విభాగం సిబ్బంది ఉన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.