నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని, బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రునాయక్ అన్నారు.
నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో బారి వర్షం వరద వల్ల తెగిన అన్న స్వామి కుంట కట్ట ప్రాంతాన్ని పర్యటించి పరిశీలించారు.
ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ మాట్లాడుతూ ఎడతెరిపి లేని వర్షాల వరుద బీభత్సం తీవ్ర నష్టం మిగిలించిదని ఆకేరు వాగు పరిసరాల ప్రాంతాలలోని 30 చెరువులు జయపురం గ్రామంలో రెండు కుంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని పంట పొలాలు, పశువులు, ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని నిర్దేశించిన నష్టపరిహారం ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కరికి అందుతుందని అధికారులు వివరాలు సేకరిస్తున్నారని అన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని గ్రామాల్లో పారిశుద్ధ పనులు చేపట్టాలని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
ఆకేరు వాగు, కుంట కింద పంట నస్టం అయిన వారికి ఎకరానికి పది వెయ్యిల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని, వరదల్లో మృతి చెందిన పశువులకు నష్టపరిహారం అందిస్తామని, విద్యుత్ లైన్లు తక్షణమే పునరుద్ధరించాలని విద్యుత్ అధికారులకు సూచించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జినుకల రమేష్, రాజశేఖర్, లింగారెడ్డి, దస్రు జయపురం గ్రామ పార్టీ అధ్యక్షుడు బల్లె ఐలయ్య, రాసమల్ల భద్రయ్య, సూర యాకయ్య,నెలకుర్తి అశోక్ రెడ్డి, చంద్రారెడ్డి, వెంకట్ రెడ్డి, బొల్లం, వాసు చుక్క వెంకన్న
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు

.jpg)
.jpg)
