ప్రజల భద్రతే మా లక్ష్యం :ఎస్ఐ రాజు.
దంతాలపల్లి మండల ప్రజలకు పోలీస్ ల విజ్ఞప్తి.
(నమస్తే మానుకోట న్యూస్-దంతాలపల్లి)
రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దంతాలపల్లి ఎస్సై పిల్లల రాజు మండల ప్రజలకు సూచించారు. బుధవారం ఎస్ఐ ఒక ప్రకటనలో మాట్లాడుతూ చెరువులు ,వాగులు, వంకలు వద్దకు చేపలు పట్టుటకు ఎవరు వెళ్లకూడదని,వాగులు వంకలు పొంగుతున్న కారణంగా రోడ్ల పైన చెట్లు పడిపోవడం జరిగింది కనుక ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.రైతులు పొలాల వద్ద తడిచేతులతో స్టార్టర్లు, కరెంటు పోలు, ఇనుప స్తంభాలు ముట్టుకోవద్దని,ఎవైనా విద్యుత్ సమస్యలు ఉంటే సంభందిత అధికారులకు సమాచారం ఇవ్వాలని,అతి పురాతనమైన ఇండ్లలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే డయల్100కు ఫోన్ చేయాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వర్షం ఉదృతి ఎక్కువైన చోట వాటి వద్ద సెల్ఫీలు తీసుకోవడం లాంటివి చేయకూడదని,అత్యవసరం అయితే తప్ప బయటకి రావద్దని ,అత్యవసర సమయాలలో డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. దంతాలపల్లి పోలీసులు ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని అన్నారు.

