నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవము, హరితహార పథకంలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నాటిన మొక్కలు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి
నర్సింహులపేట మండల కేంద్రము నుండి జయపురం గ్రామానికి పోవు రొడ్డుకు ఇరువైపులా హరిత హారం పథకంలో పెట్టిన చెట్లు నరికివేత కు గురువుతున్నా, ఇటు పంచాయతీ అధికారులు గాని అటు మండల అధికారులు గాని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి
ఎంతో ప్రజా ధనం వెచ్చించి హరిత హారంలో భాగంగా పెంచిన చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్టు నరికేస్తున్నారు
ఇకనైనా అధికారులు స్పందించి చెట్లు నరికివేతకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు


