నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా నర్సింహులపేట మండలంలోని బక్కతండ గ్రామ పంచాయతీకి పోయో కుంటకట్ట వరద తాకిడికి తెగిపోయి బక్కతండ, బండమీది తండ, పోట్యాతండ, వంకాయతండ నాలుగు తండావాసులకు రాకపోకలు బందైనాయి
అసలే వర్షాకాలం సీజనల్ వ్యాదులు జ్వరాలతో బాధపడుతుంటే కట్ట దారి తెగి రెండు రోజులైనా సంబంధిత అధికారులు వచ్చి చూసి ఫోటోలు దిగి పోతున్నారు తప్పా మరమత్తులు ఏం చేపీయలేదు అని, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వుద్దులకు అనుకోని సంఘటన జరిగితే హాస్పిటల్ కు ఎలా తీసికు పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
బక్కతండ శివారులోని అన్నా స్వామి కుంట సర్వే నెంబర్ 259 18 ఎకరాల 16 గుంటల విస్తరణ ఉండగా కుంటకు రెండు వైపులా మత్తడి ఉండేది
ఒక వైపు మత్తడిని కొందరు రైతులు కబ్జా చేసి తీసివేసి సాగుచేసుకుంటున్నారు
రెండో వైపు మత్తడిని పూడ్చి కొందరు ఇండ్ల నిర్మించుకున్నారు
ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కుంట శిఖం భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, తొందరగా రోడ్డును పునర్నిర్మాణం చేయాలను కోరుతున్నారు


