◆రహదారిపై ఉదృతంగా ప్రవహిస్తున్న బీచ్ రాజ్ పల్లి వాగులు.
◆నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన తండ్రి కూతుళ్ళు.
◆యువతి యువ సైంటిస్ట్ గా గుర్తింపు.
(నమస్తే మానుకోట-మరిపెడ )
మహబూబాబాద్ జిల్లాలో వర్షం భీవత్సవాన్నీ సృష్టిస్తోంది.మరిపెడ మండలంలోని పలు గ్రామాల్లో వరదనీరు ముంచెత్తుతోంది.పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జి పై నుంచి వరద నీరు భారీగాప్రవహిస్తుంది.వరద దాటికి అటుగా వెళ్తున్న ఓ కారు వరద ప్రవాహంలో కొట్టుకు పోయినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు.. నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్వినిగా గుర్తించారు.కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరామని పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కారు అదుపుతప్పి వాగులోకి కొట్టుకు పోయిందని, మా.. మెడ వరకు నీరు వచ్చిందని తండ్రి కూతురు.. తమ బందువులకు పోన్ లు చేసి తెలియజేసినట్లుగా తెలుస్తోంది.మళ్ళీ తిరిగి వారికి పోన్ చేసిన భందువులకు ఫోన్ లు కలవడం లేదని వాపోతున్నారు.ప్రభుత్వం తమవారిని కాపాడాలని వేడుకుంటున్నారు.



