నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
ఎడతెరిపి లేకుండా కురుసిన భారీ వర్షాలకు నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామ శివారులోని అక్కిరాల చెరువు కట్టకు రెండు చోట్ల గండి పడి నీరు వృధాగా పోతుందని గ్రామస్తులు, రైతులు
సమాచారం ఇవవడంతో సమాచారం తెలుసుకున్న గ్రామ స్పెషల్ ఆఫీసర్, తాహశిల్దార్ నాగరాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకట్రాం, మాజి సర్పంచ్ మందుల యాకన్న గ్రామ పంచాయతీ సిబ్బందితో చెరువు వద్దకు వెళ్ళి పరిశీలించి గండ్లను జేసీబీ సహాయంతో రాళ్ళు, మొరంతో పూడ్చి వేశారు
దీంతో గ్రామంలోని రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు


