(నమస్తే మానుకోట-మహబూబాబాద్ ఆగస్ట్21)
విష జ్వరాలు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ప్రతి ఒక్కరూ ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మురళీధర్ సూచించారు .బుధవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి. మురళీధర్, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులకు మరియు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కి, హెల్త్ సూపర్వైజర్ లతో , కీటక జనతా వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ, వర్షాకాలంలో ముఖ్యంగా చికున్ గున్యా , డెంగ్యూ, మలేరియా ఫైలేరియా లాంటి వ్యాధులు రాకుండా, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే చేయాలని, పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని,మలేరియా లార్వాలను డిస్కవర్ చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని, హాస్టల్స్ విజిట్ చేయాలని, జ్వరం వస్తే, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని సంప్రదించాలని, మందులు సరిపడా ఉంచుకోవాలని, కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్ కుమార్, కె.వి.రాజు,గీతా,హెల్త్ ఎడ్యుకేటర్, డిపిఓ రుక్ముద్దీన్, వైద్యాధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.


