(నమస్తే మానుకోట న్యూస్ దంతాలపల్లి ):మండల వ్యవసాయ అధికారికి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆద్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాటను విస్మరించి షరతులు వర్తింప చేయడం మంచి పద్దతి కాదన్నారు,రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పట్టాదారి పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని.అదేవిధంగా వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని పంటల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు.అంతేకాకుండా ఈ సీజన్ కు సంబంధించి ఇంతవరకు రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దంతాలపల్లి సబ్ డివిజన్ కార్యదర్శి చిర్రా యకన్న, పిడిఎస్యు డివిజన్ కార్యదర్శి గొడిశాల మనోజ్,పార్టీ నాయకులు ఉమేష్,వెంకన్న,లక్ష్మయ్య,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పట్టాదారి పాసు పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలి:న్యూడెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న.
August 22, 2024
0
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

