◆స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందడుగు.
◆రాజకీయ శిబిరంలోకి భూపాల్ నాయక్.
◆నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ విస్తారనే లక్ష్యం.
◆సర్పంచ్, ఎంపిటిసిల ఆశావహులతో ఈనెల 25న ముఖాముఖి కార్యక్రమం.
◆ఇప్పటికే మండల ఇన్చార్జిలతో సమావేశం.
(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
డోర్నకల్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా కిసాన్ పరివార్ అధినేత ననావత్ భూపాల్ నాయక్ ఆలోచన చేస్తున్నట్లు భూపాల్ నాయక్ టీమ్ నర్సింహులపేట మండల ఇంచార్జ్ చిలిమెల్ల గణేష్ పేర్కొన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కేంద్రంలో ఆయన విలేరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల నుండి భూపాల్ నాయక్ డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. యువతకు, రైతాంగానికి భరోసా ఇచ్చి, భవిష్యత్తుకు భరోసా పేరుతో గతంలో ఐదు పథకాల ప్రకటన విడుదల చేశారని పేర్కొన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే పరివార్ అధినేత ననావత్ భూపాల్ నాయక్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన తెలిపారు. డోర్నకల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి అనగా నర్సింహులపేట, దంతాలపల్లి, మరిపెడ, చిన్నగూడూరు, కురవి, సిరొలు, డోర్నకల్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలలో నుంచి వార్డ్ మెంబర్ ఆశావాహులు, సర్పంచ్, ఎంపీటీసీ ఆశావాహులతో ఈ నేల 25 న కురవి మండలం కందికొండ (స్టేజి) "శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ " లో ఆదివారం ఉదయం 10.30 కు మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తంచేశారు. ఆసక్తి, ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఉన్నవారు సెల్ నెంబర్ 9440057073 ను సంప్రదించాలని కోరారు. వీటితో పాటు హైదరాబాద్ కొండాపూర్ లో కిసాన్ పరివార్ బ్రాంచ్ ను రేపు ప్రారంభోత్సవం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. అతి త్వరలో మండలానికి ఒకటి చొప్పున కిసాన్ పరివార్ ఆఫీస్ లు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.


