(నమస్తే మానుకోట-దంతాలపల్లి) : డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ జన్మదిన వేడుకలను సోమవారం మాజీ ఎమ్మెల్యే స్వగృహం ఉగ్గంపల్లిలో ఘనంగా నిర్వహించారు. దంతాలపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా ఉగ్గంపల్లికి తరలివెళ్లి కేక్ కట్ చేసి,శాలువాలు,గజమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో బారాస పార్టీ మండల అధ్యక్షులు ధర్మారపు వేణు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి, మండల నాయకులు ఓలాద్రి మల్లారెడ్డి,బారాస యువజన మండల అధ్యక్షులు వీరబోయిన కిషోర్,పార్టీ సోషల్ మీడియా మండల అధ్యక్షులు చిల్లా రామకృష్ణ,గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు తండా రాములు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మద్దిరాల వీరస్వామి, నాయకులు గొడిశాల సంజీవరావు,రాచకొండ రామ్మూర్తి,మంగి రామ్మూర్తి,చిరగాని సుధాకర్, గుండగాని యాకయ్య,గణేష్,మద్దుల సుధాకర్ రెడ్డి, ఇట్టి మల్ల భరత్ కుమార్,మల్లం ప్రవీణ్, పాక ధర్మయ్య, శ్రీనివాస్, చారి, కృష్ణ,రేసు వెంకన్న,ఉప్పలయ్య,రవీందర్,వెంకన్న వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు,మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.


