◆మిర్చి నారుపై దుర్మార్గుల కన్ను.
◆విషప్రయోగంతో 3 లక్షల అస్థి నష్టం.
◆పంటపై పడి కన్నీరు పెట్టుకున్న రైతు సోదరులు.
◆ప్రతి ఏటా..ఇదే తంతు.
◆అన్నదాతలను పట్టించుకోని అధికారులు.
◆కురవి ,డోర్నకల్ మండలాల పరిధిలో బలై పోతున్న అమాయక రైతులు.
(నమస్తే మానుకోట న్యూస్-డోర్నకల్)
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సంకీస గ్రామంలో కౌలు రైతులు నాగునూరి ఉపేందర్ ,కోటేశ్వరరావు, అన్నదమ్ములు.. వారికి వ్యవసాయ భూమి లేకపోవడంతో కౌలుకి భూములు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.. సుమారు 8 ఎకరాలకు సరిపడా మిర్చి నారు ను సాగుచేశారు..ఆ నారును చిన్నపిల్లల్లా చూసుకుంటూ మూడు లక్షల వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టారు .తీరా మిర్చి తోట వేసే సమయంలో రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి నారు పై విష ప్రయోగం చేయడంతో నారు పూర్తిగా ఎండిపోయింది.. ఎండిపోయిన మిర్చి నారు ను చూసి రైతు బోరుమని విలపించారు... సుమారుగా 3లక్షలు అప్పు చేసి మిర్చి నారును సాగు చేసి తీరా మిర్చి తోట వేసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి నారు పై విష ప్రయోగం చేయడం దారుణమని విష ప్రయోగం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని..రైతు మీదా ఉన్న కోపాన్ని పంటపై చూపించడం ఎంత వరకు న్యాయం మని కన్నీరుగా తెలిపారు.. రైతు కన్నీరును చూసి తోటి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే కౌలు రైతును ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.
ప్రతిఏటా ఇదే తంతు...బలైపోతున్న రైతన్నలు.
కురవి,డోర్నకల్ మండలాల పరిధిలోని గిరిజన తండాలు ,గ్రామాల్లో ప్రతిఏటా ఇదే తంతు జరుగుతున్న భాదితులను పట్టించుకున్న నాథుడే లేడు.ఆ ప్రాంతాల్లో ఆసియా ఖండంలోనే డోర్నకల్ మిర్చీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.ఇక్కడి రైతులు ఎండా ,వానను లెక్కచేయకుండా రక్తాన్ని స్వేద బిందువులుగా మార్చి ,ప్రపంచానికి మిర్చిని అందిస్తున్నారు.ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు ఈ ప్రాంతాల్లో నర్సరీలను ఏర్పాటు చేసుకుని లక్షలు గడిస్తున్నారు.కాగా ఇలా రైతులు స్వతహాగా ఏర్పాటు చేసుకునే మిర్చి నారు మాత్రం ప్రతి ఏటా ఏదో ఒక గిరిజన తండాలో విషయప్రయోగానికి గురవడం కొసమెరుపు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిందితులను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని,భాదిత రైతులను ఆదుకోవాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.

