◆ప్రభుత్వ భూమా..! పట్టా భూమా..!
◆సర్వేనెంబర్ 321 పరిశీలన..రెవెన్యూ, పంచాయతీ అధికారులదే బాధ్యత.
◆నేను ఒక దళిత బిడ్డ నే.
◆దళితుల భూమిని ఆక్రమించుకోవలసిన అవసరం లేదు.
◆అసత్య ఆరోపణలు చేయవద్దు..!
◆గుగ్గిళ్ళ పిరయ్య వాక్యాలు సరైనవి కావు.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
దంతాలపల్లి మండలంలోని నిదానపురం గ్రామానికి చెందిన దళితుల భూమిని ఎవరు ఆక్రమించుకోలేదని గ్రామ మాజీ సర్పంచ్ పెండ్యాల నరేష్ అన్నారు. సోమవారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకుడు గుగ్గిళ్ళ పీరయ్య నాపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. నేను దళిత జాతి బిడ్డనేనని గుర్తుంచుకోవాలని వారన్నారు. గతంలో రెవెన్యూ అధికారులు పల్లె ప్రగతిలో భాగంగా నర్సరీ, డంపింగ్ యార్డ్ నిర్మాణం కొరకు సర్వే చేసి గ్రామపంచాయతీకి అప్పజెప్పిన పిదపనే దాంట్లో పనులు మొదలు పెట్టామని, దానికి సంబంధించిన ఆధారాలు విలేకరుల ముందు చూపెడుతూ వివరణ ఇచ్చారు. ఒక దళిత బిడ్డగా గత ఐదు సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేశానని, నర్సరీ డంపింగ్ యార్డ్ నిర్మాణం పోను మిగతా భూమిలో గ్రామానికి ఒక దేవాలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు అందరం కూడా తీర్మానం చేసుకున్నామని, కావాలనీ ఓరాజకీయా నాయకుడు రాజకీయ మనుగడ కొరకు రాజకీయం చేస్తున్నారని, మేము ఎవరి భూమి ఆక్రమించుకోలేదని మాపై చేసిన నిరాధారమైనటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని అట్టి మాటలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో,జనార్ధన్, జటంగి బిక్షం ,గుండ్ల ఉపేందర్, పూజారి ఉప్పలయ్య, రామస్వామి, వెంకన్న ,రవి ,లాలు, చింతల వెంకన్న ,కాగు పెంటయ్య ,కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

