(గోపా తండా గ్రామపంచాయతీ పరిధిలో సిఎం ఆర్ ఎఫ్ చెక్కు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు)
(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును గోపతండ గ్రామపంచాయతీకి చెందిన భూక్య కవిత ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతు హాస్పిటల్ నిమిత్తం అయినా ఖర్చు డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకోగా విడుదలైన చెక్కును గోపతండ గ్రామ పార్టీ అధ్యక్షులు రాజేందర్ నాయక్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డి చేతుల మీదిగా గోప తండాలో వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలనని ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలకు పాలన చేరవేయడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు క్యాడర్ పనిచేస్తున్నది అని అన్నారు. అభివృద్ధి పథకాలు స్వ యంగా ఇంటి వద్దకే వచ్చి ఇస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తండా యూత్ నాయకులు గ్రామ పెద్దలు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

