◆బారాస పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా .
◆భారీగా తరలివచ్చిన బిఆరెస్ పార్టీ శ్రేణులు, రైతులు.
(నమస్తే మానుకోట న్యూస్,దంతాలపల్లి)
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో నేడు బారాస పార్టీ ఆధ్వర్యంలో రైతులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా, పట్టా పాసుబుక్ ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని అన్నారు, జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా కార్యక్రమం చేపట్టిన బారాస పార్టీ నాయకుల ధర్నాలో పాల్గొన్న మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ అంశంలో దేవుని మీద ఒట్టు వేసి.. మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని,రేషన్ కార్డు ప్రామాణికం కాకూడదని అన్నారు. రేషన్ కార్డు లేని వారే ఎక్కువ ఉన్నారని అలాంటప్పుడు రేషన్ కార్డు ఎందుకని పట్టా పాస్ పుస్తకం మీద తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ కావాల్సిందేనని అన్నారు లేనిపక్షంలో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయిలో ఆందోళనలు చేస్తామని టిఆర్ఎస్ జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు ఓలాద్రి మల్లారెడ్డి, వీరబోయిన కిషోర్, చిల్లా రామకృష్ణ , అంకం సోమేశ్వర్ ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మద్దిరాల వీరస్వామి, బారాస పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తండ రాములు , రమణారెడ్డి ,బొబ్బ సంజీవరెడ్డి , బారాస నాయకులు గొడిశాల సంజీవరావు , కృష్ణారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు ,రొయ్యల సురేష్ , రాచకొండ రామ్మూర్తి ,మంగి రామ్మూర్తి ,చిరగాని సుధాకర్, చిరగాని శ్రీనివాస్, దుబ్బాకుల సత్తయ్య ,తాటిమల్ల అనంత రాములు , గుండె రాంనర్సయ్య , మల్లం లింగన్న, ప్రవీణు ,మద్దుల సుధాకర్ రెడ్డి ,ఈదురు రామచంద్రు, తండ శ్రీనివాస్ ,బండి రాము ,ఉడుగుల వీరన్న, కృష్ణ మల్లయ్య, ఉప్పలయ్య, వెంకన్న ,హరీష్ రావు మరియు బారాస పార్టీ ముఖ్య నాయకులుఔ రైతులు తదితరులు పాల్గొన్నారు.

