◆ఆదర్శ గ్రామముగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
◆పల్లెసీమలో..అభివృద్ధి చేపడుదాం .
◆మౌళిక వసతులు ప్రజల వద్దకు చేర్చుదాం.
◆ఓటింగ్ సరళిలో గ్రామాన్ని ముందు ఉంచుదాం.
◆తహసీల్దార్, రెవిన్యూ సిబ్బంది సమావేశంలో వి డి సి ఛైర్మెన్ జెట్టి ఆజాద్ చంద్రశేఖర్.
(నమస్తే మానుకోట న్యూస్-దంతాలపల్లి)
పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు. ఆలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి సాధి స్తుందనేది నానుడి. ఇదే కోవలో పల్లెల అభివృద్ధి కోసం దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడెం గ్రామంలో ప్రతి ఒక్క చొరవ తీసుకుంటున్నామని,పల్లెల్లో మౌలిక సమస్యలు పరిష్కారం, అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయని,విడిసి చైర్మన్ హైకోర్టు న్యాయవాది జెట్టి ఆజాద్ చంద్రశేఖర్ అన్నారు.గ్రామ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 680 ఫోటో గుర్తింపు కార్డులో సవరణ చేయడంలో మొదటిది లేదా ఏకైక గ్రామం బీరిశెట్టి గూడెం గ్రామం అని విడిసి చైర్మన్ హైకోర్టు న్యాయవాది జెట్టి ఆజాల్ చంద్రశేఖర్ అన్నారు.స్వగృహం లో ఏర్పాటు చేసిన తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది సన్మాన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మా గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.ఫోటో గుర్తింపు ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పుల సవరణ గ్యాస్,కరెంటు బిల్లుతో ఇంటి నెంబర్లు గుర్తింపు కార్డులను పూర్తి అడ్రస్సు ఒకే విధంగా ఏకీకృతము చెయ్యడం అదే విధంగా చిరునామాలు సరలికృతం చేసే కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలో ఇంటి నెంబర్ ప్రకారం ఉండే విధంగా విడిసి కృషి చేసిందని ఈ సందర్భంగా దంతాలపల్లి తాసిల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తాసిల్దార్ శ్రీలత మరియు ఆర్ ఐ నజీముద్దీన్ రెవెన్యూ సిబ్బంది చాలా సహకరించారని ఘనంగా వారిని సన్మానించారు. దీనివల్ల మా గ్రామంలో 50 శాతం ఓటర్ గుర్తింపు సవరణ జరిగిందని తెలియజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వాటర్ గుర్తింపు కార్డు ఇబ్బందులు లేకుండా సవరించామని అన్నారు. అంతేగాక మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా యొక్క లక్ష్యమని ఆయన అన్నారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మంచి పేరు తేవడం కోసం కృషి చేస్తున్నామని అదేవిధంగా మండలం కూడా ఆ దిశగా తీసుకుపోవాలని మా ప్రయత్నం సఫలం కావాలని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు,ఈ కార్యక్రమంలో కార్యదర్శి మల్లి కార్జున్,కారొబార్ లింగ,న్నఆలేటి రవి,సూర బోయిన వెంకన్న,లింగన్న,ఉమ్మగాని శ్రీనివాస్,మిడతపల్లి,సురేందర్, రవికుమార్,నాగన్న,జగన్,వీరాచారి,లింగరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags

